అజిత్‌ 'వివేగానికి' భారీ రేటు!

అజిత్‌ 'వివేగానికి' భారీ రేటు!


భారీ అంచనాలతో తెరకెక్కుతున్న హీరో అజిత్‌ తాజా చిత్రం 'వివేగం'.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మేకర్స్‌ తాజాగా తెలుగు మార్కెట్‌పై దృష్టి పెట్టారు. స్పై థ్రిల్లర్‌గా తమిళ, తెలుగు భాషల్లో ఆగస్టు 10న ఈ సినిమా విడుదలకానుంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సినిమా తెలుగు థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ. 4.5 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.వ్యాపారపరంగా చూసుకుంటే తెలుగు మార్కెట్‌లో అజిత్‌ సినిమాకు ఇదే హయ్యెస్ట్‌ రేటు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. అక్షరహాసన్‌ కీలక పాత్రలోనూ నటిస్తోంది. హిందీ స్టార్‌ నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో అజిత్‌ రిస్కీ సన్నివేశాల్లోనూ డూప్‌ లేకుండా నటించారని చిత్రబృందం చెప్తోంది.

Back to Top