కూలిన విమానం : ఐదుగురు మృతి | 5 feared dead in Australia plane crash | Sakshi
Sakshi News home page

కూలిన విమానం : ఐదుగురు మృతి

Mar 22 2014 11:04 AM | Updated on Sep 2 2017 5:01 AM

గాలిలో ఎగురుతున్న చిన్న విమానంలో అకస్మాత్తుగా అగ్ని జ్వాలలు ఎగిసిపడి ఒక్కసారిగా కుప్పకూలింది.

గాలిలో ఎగురుతున్న చిన్న విమానంలో అకస్మాత్తుగా అగ్ని జ్వాలలు ఎగిసిపడి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. శనివారం ఉదయం పశ్చిమ ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో సమీపంలోని కబుల్టుర్లో ఆ దుర్ఘటన చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

 

విమానం కూలిన ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే క్వీన్లాండ్స్ అగ్నిమాపక సిబ్బంది, సహాయక చర్యల అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే విమానం బుగ్గి అయిందని తెలిపారు. అంతా కళ్ల ముందు నిముషాలలో జరిగి పోయిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని ఉన్నతాధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement