పట్టణ బ్యాంకు రుణాలనూ మాఫీ చేయాలి | Urban bank loans also should be waived | Sakshi
Sakshi News home page

పట్టణ బ్యాంకు రుణాలనూ మాఫీ చేయాలి

Sep 5 2014 12:59 AM | Updated on Aug 21 2018 5:36 PM

పట్టణ బ్యాంకు రుణాలనూ మాఫీ చేయాలి - Sakshi

పట్టణ బ్యాంకు రుణాలనూ మాఫీ చేయాలి

పట్టణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలనూ మాఫీ చేయాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడారు.

* ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్
* పార్టీని వీడిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారు

 
సాక్షి, ఖమ్మం: పట్టణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలనూ మాఫీ చేయాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ రైతులు చాలా మంది పట్టణ బ్యాంకుల్లో కూడా రుణం తీసుకున్నారని, వీరందరికీ రుణమాఫీ వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పార్టీ విధివిధానాలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీన ప్రకటన చేస్తారని తెలిపారు.
 
కుంటి సాకులు చెప్పి ఇటీవల పార్టీని వీడిన వారికి రానున్న కాలంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తాము కూడా పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ శానససభ పక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడారు. కాగా,  తాము పార్టీని వీడబోమంటూ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు వేదికపై వైఎస్సార్ విగ్రహం ముందున్న జ్యోతిపై ప్రమాణం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement