4 నుంచి మూడో విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ 

TSPSC Conducts Computer Test For Group 4 Selected Candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–4లో జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్‌ స్టెనో, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్టు పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్థులకు వచ్చే నెల 4 నుంచి 7 వరకు మూడో విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. వెరిఫికేషన్‌ హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఉంటుందని పేర్కొంది. అలాగే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థులకు మార్చి 8న కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తామని తెలిపింది. అభ్యర్థులు పోస్టులు, జోన్ల ప్రాధాన్యతలను బట్టి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. వెబ్‌ ఆప్షన్ల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలకు  www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top