సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

Tight security for CM KCR's visit to Suryapet on Oct 12 - Sakshi

కలెక్టర్‌ సురేంద్రమోహన్‌

డీఐజీ, ఎస్పీతో కలిసి సీఎం పర్యటించనున్న ప్రదేశాల పరిశీలన

సూర్యాపేట : ఈ నెల 12న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటనకు రానున్నందుకు పటిష్టమైన ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ సురేంద్రమోహన్‌ తెలి పారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రదేశాలను సోమవారం డీఐజీ ఎన్‌.శివశంకర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రకాశ్‌జాధవ్, సంయుక్త కలెక్టర్‌ సంజీవరెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ముఖ్యమంత్రి హైదరాబాద్‌ నుంచి హెలి కాప్టర్‌ ద్వారా బయలుదేరి సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలో లాండ్‌ అవుతారన్నారు. అనంతరం ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలోని ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

 గొల్లబజార్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సమూదాయాయానికి ప్రారంభోత్సవం చేయనున్నట్టు తెలిపారు. అనంతరం కుడకుడ రోడ్డులో కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన, వీకే.పహాడ్‌లో నిర్మించిన 400 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభం, బి.చందుపట్లలో నిర్మించిన మిషన్‌ భగీరథ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారన్నారు. అలాగే బి.చందుపట్ల మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రం, ఎస్సీ హాస్టల్‌ సందర్శించనున్నట్టు కలెక్టర్‌ పేర్కొన్నారు.  ఆయా ప్రదేశాలను సందర్శించిన వారిలో ఆర్‌అండ్‌బీ, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, అటవీశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.   

భవనాల పరిశీలన..
చివ్వెంల (సూర్యాపేట) : మండలంలో ఈ నెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటించి పరిశీలించనున్న ప్రభుత్వ భవనాలను సోమవారం అధికారులు సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బి.చందుపట్ల గ్రామంలో మోడల్‌ ఎస్సీ హాస్టల్, అంగన్‌వాడీ కేంద్రం, అదేవిధంగా మిషన్‌ భగీరథ పనులతో పాటు వట్టిఖమ్మంపహాడ్‌ గ్రామ శివారులో రూ.302 కోట్ల వ్యయంతో నిర్మించిన 420 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ శివశంకర్‌రెడ్డి, కలెక్టర్‌ కె.సురేంద్రమోహన్, ఎస్పీ ప్రకాశ్‌జాదవ్, డీఎంహెచ్‌ఓ తండు మురళీమోహన్‌. డీఎస్పీ నాగేశ్వర్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కె.శ్రీనివాస్‌రాజ్‌ తదితరులు ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top