బాలికపై లైంగికదాడి | Sexual assault on minor girl | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడి

Jul 12 2014 2:43 AM | Updated on Jul 23 2018 9:13 PM

బాలికపై లైంగికదాడి - Sakshi

బాలికపై లైంగికదాడి

ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడి వీడియోలో చిత్రీకరించాడు ఓ ప్రబుద్ధుడు.

- వీడియోలో చిత్రీకరించి..
-ఐదు నెలలుగా వేధింపులు
బసంత్‌నగర్: ఓ  బాలికపై లైంగికదాడికి పాల్పడి వీడియోలో చిత్రీకరించాడు ఓ ప్రబుద్ధుడు. విషయం ఎవరికైన చెబితే వీడియోని అందరికీ పంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. శుక్రవారం బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగుచూసింది. ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాలు.. రామగుండం మండలం రామారావుపల్లికి చెందిన మంచినీళ్ల కమలాకర్(27) గుడిపల్లికి చెందిన మైనర్‌పై ఐదు నెలల క్రితం లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. అంతటితో ఆగకుండా తిరిగి లైంగిక వేధింపులకు గురిచేయసాగాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో గతంలో తీసిన వీడియోను గుడిపెల్లిలోని కొందరి సెల్‌ఫోన్లలోకి పంపించాడు. ఈమేరకు బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో నిర్భయ చట్టంతోపాటు లైంగిక దాడుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement