చిన్నారిపై వృద్ధుడి లైంగికదాడి | Sexual assault on a child | Sakshi
Sakshi News home page

చిన్నారిపై వృద్ధుడి లైంగికదాడి

Sep 30 2014 1:50 AM | Updated on Jul 23 2018 9:13 PM

అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని బావుసింగ్‌పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చిట్యాల : అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని బావుసింగ్‌పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిట్యాల సీఐ రవీందర్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 27న వారు కూలి పనులకు వెళ్లారు. ఇంటి పక్కనే ఉన్న అజ్మీర మొగిళి ఆడుకుంటున్న చిన్నారిని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని  ఇంటి వద్ద వదిలి వెళ్లాడు.ఇంటికి వచ్చిన తల్లి దండ్రులు ఇంటి పనులు చేసుకుని నిద్రించారు. తెల్లారి ఉదయం చిన్నారికి తల్లి స్నానం చేయిస్తుండగా రక్తస్రావం జరిగినట్లు గమనించి... కుమార్తెను అడగడంతో విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement