నా ముందే కుర్చీలో కూర్చుంటావా? అని దళితుడిపై ఆగ్రహం

Sarpanch Fires On Dalit In Kamareddy District For Sitting On His Chair - Sakshi

సాక్షి, కామారెడ్డి : నా ముందే కుర్చీలో కూర్చుంటావా? అని ఓ సర్పంచ్‌ దళితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దళితుడు తన కుర్చీలో కూర్చోడం సహించలేని అతడు తిట్లదండకం మొదలెట్టాడు. ఈ ఘటన లింగంపేట్‌ మండలం జల్దిపల్లిలో చోటు చేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న కొంతమంది దళితులు సర్పంచ్‌ను నిలదీయగా.. మరింత కోపంతో రగిలిపోయాడు. ఆ 15 దళిత కుటుంబాలను సామాజిక బహిష్కరణకు గురిచేశాడు. దళిత కాలనీకి బోరు, మోటార్‌ విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించాడు. కిరాణా సరుకులు ఇవ్వొద్దని, మురికి కాలువల నుంచి తీసిన చెత్త తొలగించవద్దని సిబ్బందిని ఆదేశించాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top