టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ కార్యాలయంలో చోరీ | Robbery at TV production assistant office | Sakshi
Sakshi News home page

టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ కార్యాలయంలో చోరీ

Jul 4 2015 9:33 PM | Updated on Aug 30 2018 5:27 PM

బంజారాహిల్స్ పరిధిలోని ఇందిరానగర్‌లో తెలుగు సినీ, టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ కార్యాలయంలో శనివారం చోరీ జరిగింది.

బంజారాహిల్స్ (హైదరాబాద్): బంజారాహిల్స్ పరిధిలోని ఇందిరానగర్‌లో తెలుగు సినీ, టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ కార్యాలయంలో శనివారం చోరీ జరిగింది. యూనియన్ కోశాధికారి బీరువా తాళం టేబుల్‌పైన మరిచి వెళ్లిపోవడంతో... ఓ సభ్యుడు దాంతో బీరువా తాళాలు తెరిచి రూ. 50 వేలు తీసుకొని ఉడాయించాడు. దీనిపై కోశాధికారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చోరీకి పాల్పడిన సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే డబ్బులు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. రూ.10 వేలు ఖర్చయ్యాయని పేర్కొంటూ మిగతా రూ. 40 వేలను అప్పగించాడు.

Advertisement
 
Advertisement
Advertisement