ముత్యంరెడ్డి మృతి పట్ల హరీష్‌రావు దిగ్భ్రాంతి | Harish Rao Tribute To Muthyam Reddy | Sakshi
Sakshi News home page

ముత్యంరెడ్డి మృతి పట్ల హరీష్‌రావు దిగ్భ్రాంతి

Sep 2 2019 10:42 AM | Updated on Sep 2 2019 10:51 AM

Harish Rao Tribute To Muthyam Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధకరమన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు తెలంగాణ సమాజం మంచి నాయకున్ని కోల్పోయిందని అన్నారు. గ్రామ సర్పంచ్‌గా, టీటీడీ బోర్డు సభ్యులుగా, ఎమ్మెల్యే, మంత్రిగా ఆయన జిల్లా అభివృద్ధికి చేసిన సేవలు మరిచిపోలేనివని హరీష్‌ అన్నారు. చివరి దశ వరకు ప్రజా జీవితంలో పరితపించారని, నేటి నాయకులకు ముత్యంరెడ్డి స్ఫూర్తి అని అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో ముత్యంరెడ్డి భౌతిక ఖాయంను సందర్శించిన హరీష్‌.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చదవండి: మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత

చెరుకు ముత్యంరెడ్డి మృతిపట్ల దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంతాపం తెలిపారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.  ఆయన స్వగ్రామం తొగుట మండలం తుక్కాపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం ముత్యంరెడ్డి గారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement