చిట్టీ నిర్వాహకుల అరెస్ట్ | chit organisers arrested in warangal | Sakshi
Sakshi News home page

చిట్టీ నిర్వాహకుల అరెస్ట్

Jan 1 2016 6:36 PM | Updated on Aug 20 2018 4:44 PM

వరంగల్ జిల్లాలో చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్: వరంగల్ జిల్లాలో చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. నెక్కొండలో పావని ఎంటర్ ప్రైజెస్ చిట్టీల పేరుతో భారీగా మోసాలకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం నిర్వాహకులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.12.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement