గొంతులో మేకు ఇరుక్కుని బాలుడి మృతి | A boy who stuck rivet in the throat was killed | Sakshi
Sakshi News home page

గొంతులో మేకు ఇరుక్కుని బాలుడి మృతి

Mar 23 2018 2:34 AM | Updated on Mar 23 2018 2:34 AM

A boy who stuck rivet in the throat was killed - Sakshi

రిత్విక్‌

గాంధారి: గొంతులో ఇనుప మేకు ఇరుక్కుని ఓ బాలుడు మరణించాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్‌వాడి గ్రామానికి చెందిన రాధాబాయి, భాస్కర్‌రావుల కుమారుడు రిత్విక్‌(3) బుధవారం రాత్రి ఆడుకుంటూ నోట్లో ఇనుపమేకు పెట్టుకున్నాడు. అది గొంతులోకి జారిపోవడంతో శ్వాస ఆడక తీవ్రంగా ఏడవడం మొదలు పెట్టాడు. గమనించిన తల్లిదండ్రులు గాంధారి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి సిఫారసు చేయడంతో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement