విమానం టాయిలెట్‌లో 4 కిలోల బంగారం | 4 kg of gold in the plane toilet | Sakshi
Sakshi News home page

విమానం టాయిలెట్‌లో 4 కిలోల బంగారం

May 31 2015 1:34 AM | Updated on Sep 3 2017 2:57 AM

శనివారం తెల్లవారుజామున మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఎయిర్ ఇండియా .....

శంషాబాద్: శనివారం తెల్లవారుజామున మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు తనతో పాటు అక్రమంగా తీసుకొచ్చిన  4 కేజీల బంగారు బిస్కెట్లను పట్టుబడుతాననే భయంతో లగేజీ బ్యాగును విమానంలోని టాయిలెట్‌లో వదిలేసి వెళ్లాడు.

బంగారాన్ని గమనించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం డీఆర్‌ఐ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement