నోకియా 3310 సేల్ నేటి నుంచే..

నోకియా 3310 సేల్ నేటి నుంచే..

నోకియా బ్రాండు ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310 నేటి నుంచే అమ్మకానికి వస్తోంది. దేశంలోని అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ ఫోన్ ను హెచ్ఎండీ గ్లోబల్ గురువారం నుంచి విక్రయానికి ఉంచుతోంది. ఈ వారం మొదట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ వార్మ్ రెడ్,  ఎల్లో, డార్క్ బ్లూ, గ్రే రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. మోడల్ పేరునే ఈ ఫోన్ ధరగా నిర్ణయించి హెచ్ఎండీ గ్లోబల్ అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో దీన్ని హెచ్ఎండీ గ్లోబల్ విడుదల చేసింది. అనంతరం మే 16న భారత్ లోకి అధికారికంగా లాంచ్ చేసింది. 2జీ మొబైల్ డేటా నెట్ వర్క్ ను మాత్రమే ఈ ఫోన్ సపోర్టు చేస్తోంది. వై-ఫైను ఇది సపోర్టు చేయదు.  ఒరిజినల్ ఫోన్ లో మాదిరిగానే స్నేక్ గేమ్ ను ఈ ఫోన్ కలిగి ఉంది.

 

2017 నోకియా 3310 ఫీచర్లు..

2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే

1200ఎంఏహెచ్ బ్యాటరీ(22.1 గంటల వరకు టాక్ టైమ్ పవర్)

రేడియో, మ్యూజిక్ ప్లేయర్, నోకియా మైక్రోయూఎస్బీ ఛార్జర్

16ఎంబీ ఫోన్ స్పేస్

32జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డుతో వాడుకోవచ్చు

2ఎంపీ వెనుక కెమెరా విత్  ఎల్ఈడీ ఫ్లాష్

బ్రౌజింగ్ ఆప్షన్ ఉంటుంది కానీ యాప్స్ డౌన్ లోడ్ కు అవకాశం లేదు
Back to Top