ఆ హీరోయిన్ ఇంటి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లు కట్ చేస్తాం | water connection cut to Nayanathara house in ooty | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ ఇంటి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లు కట్ చేస్తాం

Mar 5 2015 3:46 PM | Updated on Sep 2 2017 10:21 PM

ఆ హీరోయిన్ ఇంటి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లు కట్ చేస్తాం

ఆ హీరోయిన్ ఇంటి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లు కట్ చేస్తాం

ఇంటి పన్ను కట్టనందుకుగాను నటుడు జయరాం, నటి నయనతారల ఇంటి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లను కట్ చేయనున్నట్లు ఊటీ కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేసింది.

చెన్నై: ఇంటి పన్ను కట్టనందుకుగాను నటుడు జయరాం, నటి నయనతారల ఇంటి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లను కట్ చేయనున్నట్లు ఊటీ కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని లవ్‌టెల్ రోడ్డు రాయల్ కాస్టిల్ అనే ప్రాంతంలో 122 ఇళ్లు ఉన్నాయి. వీటి సొంతదారులు కొందరు కార్పొరేషన్‌కు ఇంటి పన్నును చాలా కాలంగా చెల్లించడం లేదు. దీంతో కార్పొరేషన్ అధికారులు మంగళవారం పన్ను కట్టని ఇళ్లకు జప్తు నోటీసులు అంటించి వచ్చారు. దీని గురించి కార్పొరేషన్ కమిషనర్ శివకుమార్ మాట్లాడుతూ, ఊటీ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటి పన్ను వసూలు చేస్తున్నట్లు చెప్పారు.

రాయల్ కాస్టిల్ ప్రాంతంలో నటుడు జయరాం, నటి నయనతారలకు చెందిన ఇళ్లు ఉన్నాయన్నారు. వారితో పాటు పలు వ్యాపారవేత్తలు ఇంటి పన్ను చెల్లించకపోవడంతో తాము ఒత్తిడి తీసుకొస్తూ నోటీసులు కూడా అంటించామన్నారు. అయినా వాటిని కొందరు చింపి పారేశారే గానీ పన్ను చెల్లించలేదన్నారు. దీంతో వారి ఇళ్లకు జప్తు నోటీసు అంటించినట్లు తెలిపారు. ఇప్పటికీ వారు స్పందిచకపోతే ముందుగా వారి ఇళ్లకు వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లను కట్ చేయనున్నట్లు ఆ తరువాత జప్తుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement