వాషింగ్ మెషీన్‌లో ఇరుక్కున్న రెండేళ్ల బాలుడు | Two-year -old boy trapped in the washing machine | Sakshi
Sakshi News home page

వాషింగ్ మెషీన్‌లో ఇరుక్కున్న రెండేళ్ల బాలుడు

Mar 17 2016 8:21 PM | Updated on Sep 3 2017 7:59 PM

రెండేళ్ల బాలుడు ‘వాషింగ్ మెషీన్’లో ఇరుక్కున్న సంఘటన కలబుర్గిలోని విద్యానగరలో చోటు చేసుకుంది.

రెండేళ్ల బాలుడు ‘వాషింగ్ మెషీన్’లో ఇరుక్కున్న సంఘటన కలబుర్గిలోని విద్యానగరలో చోటు చేసుకుంది. చుట్టుపక్కల వారు అరగంట పాటు శ్రమించి వాషింగ్ మెషీన్‌ను విరగ్గొట్టి బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. వివరాలు....కలబుర్గిలోని విద్యానగరలో నివాసం ఉంటున్న దంపతుల రెండేళ్ల కుమారుడు కుర్చీ సహాయంతో టాప్‌లోడ్ వాషింగ్ మెషీన్‌పై ఎక్కి అందులోకి దిగి ఏడుపు మొదలు పెట్టాడు.

వంటింట్లో ఉన్న తల్లి వచ్చి చూసేసరికి ఆ చిన్నారి వాషింగ్ మెషీన్‌లో ఇరుక్కొని కనిపించాడు. కాళ్లు మెషీన్‌లో ఇరుక్కు పోవడంతో బయటకు తీయడం సాధ్యం కాలేదు. కుమారుడి పరిస్థితిని చూసి భయంతో ఆమె కేకలు వేయగా పక్కింటి వారు వచ్చి అరగంట పాటు శ్రమించి వాషింగ్ మెషీన్‌ను కత్తితో కత్తరించేసి బాలుడిని సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలుడు దిగిన సమయంలో వాషింగ్ మెషీన్ ఆన్‌లో లేదని, అందువల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని ఘటనా స్థలంలో ఉన్న వారు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement