బ్యాంకు ఎదుట దోపిడీ యత్నం | thief try to robbery from old man | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఎదుట దోపిడీ యత్నం

Sep 1 2017 8:18 AM | Updated on Sep 17 2017 6:15 PM

బ్యాంకు ఎదుట దోపిడీ యత్నం

బ్యాంకు ఎదుట దోపిడీ యత్నం

గుడియాత్తంలో బ్యాంకు ఆవరణలో రైతు వద్ద నగదు దోపిడీకి యత్నించిన ఆంధ్ర యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు.

ఆంధ్ర యువకుడికి దేహశుద్ధి
వేలూరు: గుడియాత్తంలో బ్యాంకు ఆవరణలో రైతు వద్ద నగదు దోపిడీకి యత్నించిన ఆంధ్ర యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపం కల్లపాడికి చెందిన రైతు కార్తికేయన్‌. ఇతడు బంగారు నగలను కుదవ పెట్టి నగదు తీసుకునేందుకు గుడియాత్తంలోని ఇండియన్‌ బ్యాంకుకు గురువారం బైక్‌పై వెళ్లాడు. బ్యాంకులో రూ.55వేలు నగదు తీసుకొని బైక్‌పై పెట్టుకొని ఇంటికి బయలు దేరాడు. దీన్ని గమనించిన ఓ యువకుడు నగదు ఉన్న సంచిని లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు.

కార్తికేయన్‌ కేకలు వేయడంతో అక్కడున్న వారు అప్రమత్తమై యువకుడిని పట్టుకొని నగదు సంచిని  కార్తికేయన్‌కు అప్పగించారు. యువకుడిని సమీపంలోని విద్యుత్‌ స్తంభానికి కట్టి దేహశుద్ధి జరిపి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో సదరు  యువకుడు ఆంధ్ర రాష్ట్రం విజయవాడలోని ఆటోనగర్‌కు చెందిన శ్రీనివాసన్‌ అని, పెయింటింగ్‌ పనుల కోసం గుడియాత్తం వచ్చినట్లు తెలిసింది. అతని వద్ద పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement