సాహసరాణి నిక్కీగల్రాణి | Nikki Galrani police offcer role | Sakshi
Sakshi News home page

సాహసరాణి నిక్కీగల్రాణి

Dec 28 2015 2:32 AM | Updated on Sep 3 2017 2:40 PM

సాహసరాణి నిక్కీగల్రాణి

సాహసరాణి నిక్కీగల్రాణి

కొన్ని సార్లు రిస్కీ ఫైట్స్ అనిపిస్తే ప్రముఖ హీరోలకే డూప్‌లను నటింపజేస్తారు.

కొన్ని సార్లు రిస్కీ ఫైట్స్ అనిపిస్తే ప్రముఖ హీరోలకే డూప్‌లను నటింపజేస్తారు. అలాంటిది నటి నిక్కీగల్రాణి ఏకంగా కరాటే ఫైట్‌లోనే డూప్ లేకుండా నటించేసిందట. ముద్దుగా డార్లింగ్ అంటూ దెయ్యంగా తమిళ ప్రేక్షకుల్ని భయపెట్టేసి గుర్తింపుపొందేసిన నటి నిక్కీగల్రాణి. ఆ తరువాత యాగవరాయనుమ్ నాకాక్క తదితర చిత్రాల్లో మెరిసి వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఎళిల్ దర్శకత్వంలో విష్ణువిశాల్‌కు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో నిక్కీగల్రాణి పోలీస్ అధికారిణిగా కనిపించనుందట.

 ఇందులో ఫైట్ సన్నివేశాల్లోనూ దడదడలాడించిందట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో తన సాహస దృశ్యాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయట. ఒక ఫైట్ సన్నివేశంలో కరాటే విద్యను కూడా ప్రదర్శించిందట. ఆ ఫైట్ సన్నివేశంలో గాయాలకు గురై అస్పత్రి పాలైందట. దీని గురించి నిక్కీగల్రాణి తెలుపుతూ రిస్కీ సన్నివేశం అయిన తెలిసినా డూప్ లేకుండా తానే నటించాలని భావించానని చెప్పింది. అలా రిస్క్ తీసుకుని నటించడంతో తన కుడి చెయ్యి వేలు విరిగిందని దాంతో వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినట్లు తెలిపింది.

తాను రికవరీ అవ్వడానికి రెండు వారాలకు పైనే పట్టిందని చెప్పింది. అదే విధంగా లారెన్స్ సరసన మొట్ట శివ కెట్ట శివ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. అందులో విలేకరిగా నటిస్తుండటంతో ఆ పాత్రకు తగ్గట్టుగా కనిపించడానికి బరువు చాలా తగ్గినట్లు చెప్పింది. తమిళం,తెలుగు,కన్నడం,మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నిటిలోనూ నటిస్తున్నట్లు చెప్పింది. కన్నడం కంటే తమిళంలో ఆదరణ బాగుండడంతో చెన్నైకి మకాం మార్చినట్లు నిక్కీగల్రాణి తెలిపింది. తెలుగులో మలుపు, క్రిష్ణాష్టమి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని,అలాగే తమిళంలో కో-2 చిత్రం త్వరలో విడుదలకానుందని నిక్కీగల్రాణి వెల్లడించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement