నటుడి భార్య అదృశ్యం | Cinema Actor's wife missing in Chennai | Sakshi
Sakshi News home page

నటుడి భార్య అదృశ్యం

Aug 15 2014 9:03 AM | Updated on Aug 13 2018 4:19 PM

కరాటే రాజు, భార్య దివ్య - Sakshi

కరాటే రాజు, భార్య దివ్య

సినీ నటుడు కరాటే రాజా భార్య బుధవారం అదృశ్యమైంది. నటుడు కరాటే రాజా పోలీసులను ఆశ్రయించారు.

చెన్నై: సినీ నటుడు కరా టే రాజా భార్య బుధవారం అదృశ్యమైంది.  నటుడు కరాటే రాజా పోలీసులను ఆశ్రయించారు. కడలూరు జిల్లా సమీపంలోని మానలూరుకు చెందిన రాజా. ఈయన కరాటే రాజాగా చిత్ర పరిశ్రమలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కరాటే రాజా పుదువై సారం పూంగోళం కామరాజర్‌నగర్‌కు చెందిన మురుగన్ కూతురు దివ్యను 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు.

సారం గ్రామం సమీపంలో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. కరాటే రాజా ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉంటూ నెలలో రెండు, మూడుసార్లు మాత్రం ఇంటికి వస్తుంటారు. ఈ విషయమై ఇటీవల భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో కరాటే రాజా భార్య దివ్య బుధవారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో తన ముగ్గురు కూతుళ్లను ఆమె తల్లి ఇంటికి తీసుకెళ్లి మార్కెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన రామన్ కుటుంబ సభ్యులు ఆ ప్రాంతం అంతా గాలించారు. అయినా ఆమె జాడ తెలియలేదు. సమాచారం అందుకున్న నటుడు కరాటే రాజా గురువారం ఉదయం పుదువై కోరిమేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement