హోరెత్తిన ఎన్నికల ప్రచారం | Blustery election campaign | Sakshi
Sakshi News home page

హోరెత్తిన ఎన్నికల ప్రచారం

May 9 2016 1:38 AM | Updated on Aug 14 2018 4:34 PM

హోరెత్తిన ఎన్నికల ప్రచారం - Sakshi

హోరెత్తిన ఎన్నికల ప్రచారం

తళి నియోజక వర్గంలో ఆదివారం వివిధ పార్టీల ఎన్నికల ప్రచారం హోరెత్తింది.

 డెంకణీకోట :  తళి నియోజక వర్గంలో ఆదివారం వివిధ పార్టీల ఎన్నికల ప్రచారం హోరెత్తింది. తళి నియోజకవర్గంలోని కెలమంగలంలో ఆదివారం వారపుసంత జరిగింది. ఈ సంతలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వ్యాపారులు, రైతులు రావడంతో రాజకీయ పార్టీల  కెలమంగలంలో ప్రచారం హోరెత్తించారు.

 

 డీఎంకే ఆధ్వర్యంలో...

 డీఎంకే అభ్యర్థి వై. ప్రకాష్ ఆదివారం ఉదయం బైరమంగలం పంచాయతీ అగ్గొండపల్లి, ఎం.అగ్రహారం, బైరమంగలం, కుందుమారనపల్లి పంచాయతీలలో ప్రచారాన్ని ప్రారంభించారు. కెలమంగలంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈయన వెంట కాంగ్రెస్ నాయకుడు రామప్ప ఉన్నారు.

కరుణానిధి చేపట్టిన పథకాలు, డీఎంకే ఎన్నికల  ప్రణాళికను వివరిస్తూ ప్రచారం చేశారు. క్రిష్ణగిరి, ధర్మపురి, హొసూరు ప్రాంతాల నుండి ఆర్‌టీసి డ్రైవర్, కండెక్టర్ ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. వై.ప్రకాష్‌కు అగ్గొండపల్లిలో డీఎంకే నాయకుడు ఆనందయ్య ఘన స్వాగతం పలికారు.

 

 సీపీఐ ప్రచార హోరు..

 ప్రజాసంక్షేమ కూటమి తళి సీపీఐ అభ్యర్థి టి. రామచంద్రన్ కెలమంగలంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున డీఎండీకే, సీపీఐ, సీపీఎం, విడుదలై చిరుత పార్టీల నాయకులు వెంటరాగా రామచంద్రన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కెలమంగలం పంచాయతీ  మాజీ అధ్యక్షుడు చన్న బసప్ప, సీపీఐ నాయకులు లెనిన్, కెలమంగలం పంచాయతీ చైర్ పర్సన్ సనాజ్‌ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. 

 

 పీఎంకే అభ్యర్థి ప్రచారం

 తళి పీఎంకే పార్టీ అభ్యర్థి కెలమంగలంలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అరుణ్‌రాజ్ పీఎంకే కార్యకర్తలతో కెలమంగలంలో ఊరేగింపుగా వెళ్లి ఓట్లు  అభ్యర్థించారు. వందలాది మంది ఊరేగింపులో పాల్గొని ప్రచారం  చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement