బాత్‌రూంలో ఆరడుగుల పాము | Big Snake Caught in Bathroom Tamil nadu | Sakshi
Sakshi News home page

బాత్‌రూంలో ఆరడుగుల పాము

Jan 7 2020 8:16 AM | Updated on Jan 7 2020 8:16 AM

Big Snake Caught in Bathroom Tamil nadu - Sakshi

బాత్‌రూంలో నాగుపాము

తమిళనాడు, అన్నానగర్‌: కోవైలో ఆదివారం ఓ అపార్ట్‌మెంట్‌ ఆవరణలోని బాత్‌రూంలోకి ఆరడుగుల నాగుపాము చొరబడడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుడు దాన్ని చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. వివరాలు.. కోవై రామనాథపురం నంజుండాపురం రోడ్డులో ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌ ఉంది. ఈ ఆవరణలో జనరల్‌ బాత్‌రూమ్‌ ఉంది. అందులోకి ఆదివారం అర్ధరాత్రి 1.30 సమయంలో ఓ మహిళ వెళ్లింది. అపుడు ఓ నాగుపాము కనిపించింది. దాన్ని చూసి ఆ మహిళ దిగ్భ్రాంతి చెందింది. సమాచారం అందుకున్న ఉక్కడమ్‌కి చెందిన పాము పట్టే స్నేక్‌ అమీన్‌ సంఘటనా స్థలానికి వచ్చి దాన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదలడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement