కొత్త వ్యూహాలతో... | Viswanathan Anand Tastes First Defeat vs Magnus Carlsen in World Chess Championship | Sakshi
Sakshi News home page

కొత్త వ్యూహాలతో...

Nov 11 2014 12:15 AM | Updated on Sep 2 2017 4:12 PM

కొత్త వ్యూహాలతో...

కొత్త వ్యూహాలతో...

సోచి (రష్యా): ప్రపంచ పోరుకు పక్కాగా సిద్ధమైనా... తొలి రెండు గేముల్లో అనుకున్నరీతిలో రాణించలేకపోయిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కొత్త వ్యూహాలపై దృష్టి సారించనున్నాడు.

కార్ల్‌సన్‌తో ఆనంద్ మూడో గేమ్ నేడు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్
 

 సోచి (రష్యా): ప్రపంచ పోరుకు పక్కాగా సిద్ధమైనా... తొలి రెండు గేముల్లో అనుకున్నరీతిలో రాణించలేకపోయిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కొత్త వ్యూహాలపై దృష్టి సారించనున్నాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో మంగళవారం జరిగే మూడో గేమ్‌లో ఆనంద్ ఆటతీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

తొలి రెండు గేముల్లో ఆరంభంలో చక్కగా ఆడిన ఆనంద్ ఆ తర్వాత ప్రత్యర్థి కార్ల్‌సన్ ఎత్తులకు తగిన సమాధానం ఇవ్వలేకపోయాడు. తదుపరి గేముల్లోనూ కార్ల్‌సన్ ఎత్తులకు దీటుగా జవాబు ఇవ్వకపోతే ఆనంద్ ఈ 12 గేమ్‌ల ఈవెంట్‌లో కోలుకోవడం కష్టమే.
 

Advertisement
 
Advertisement
Advertisement