ప్రిక్వార్టర్స్‌లో సుమిత్ | Sumit pre-quarters finals | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సుమిత్

Jun 20 2016 12:40 AM | Updated on Sep 4 2017 2:53 AM

ప్రిక్వార్టర్స్‌లో సుమిత్

ప్రిక్వార్టర్స్‌లో సుమిత్

ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు).....

బాకు (అజర్ బైజాన్): ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన రెండో రౌండ్‌లో సుమిత్ 2-1 తేడాతో ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన జున్ కార్లోస్ కారిలో (కొలంబియా)పై సంచలన విజయం సాధించాడు.

మరోవైపు ఆసియా క్రీడల కాంస్య పతక విజేత సతీశ్ కుమార్ (+91 కేజీలు), డీన్ గార్డినర్ (ఐర్లాండ్)తో జరిగిన బౌట్‌లో పరాజయం చవిచూశాడు. బౌట్ మధ్యలో సతీశ్ కంటికి గాయం కావడంతో బౌట్‌ను నిలిపివేసి గార్డినర్‌ను విజేతగా ప్రకటించారు. మరో భారత బాక్సర్ అమృత్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు) తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు.

Advertisement
 
Advertisement
Advertisement