ఒలింపిక్స్‌కు సీమా అర్హత | Seema qualify for the Olympics | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌కు సీమా అర్హత

May 30 2016 3:20 AM | Updated on Sep 4 2017 1:12 AM

ఒలింపిక్స్‌కు సీమా అర్హత

ఒలింపిక్స్‌కు సీమా అర్హత

డిస్కస్ త్రోయర్ సీమా పూనియా రియో డి జనీరో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అమెరికాలో జరుగుతున్న పాట్ యంగ్స్

న్యూఢిల్లీ: డిస్కస్ త్రోయర్ సీమా పూనియా రియో డి జనీరో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అమెరికాలో జరుగుతున్న పాట్ యంగ్స్ త్రోయర్స్ క్లాసిక్ టోర్నీలో తను డిస్క్‌ను 62.62మీ. దూరం విసిరి రియో బెర్త్ దక్కించుకుంది. దీంతో 32 ఏళ్ల సీమా ఒలింపిక్స్ అర్హత దూరం 61.00మీ. అధిగమించినట్టయ్యింది.

ఈ ఈవెంట్‌లో తను... 2008 ఒలింపిక్ చాంపియన్ స్టెఫానీ బ్రౌన్‌ను అధిగమించి స్వర్ణం దక్కించుకుంది. 2014 ఆసియా గేమ్స్‌లోనూ విజేతగా నిలిచిన సీమాకిది మూడో (2004, 12) ఒలింపిక్స్. ఇప్పటిదాకా భారత్ నుంచి 19 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement