వెటెల్‌ ‘హ్యాట్రిక్‌’ పోల్‌ పొజిషన్‌  | Sebastian Vettel beats Lewis Hamilton to pole at F1 Azerbaijan Grand | Sakshi
Sakshi News home page

వెటెల్‌ ‘హ్యాట్రిక్‌’ పోల్‌ పొజిషన్‌ 

Apr 29 2018 1:30 AM | Updated on Apr 29 2018 1:30 AM

Sebastian Vettel beats Lewis Hamilton to pole at F1 Azerbaijan Grand - Sakshi

బాకు (అజర్‌బైజాన్‌): ఫెరారీ జట్టు డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ వరుసగా మూడో పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం జరిగిన అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో వెటెల్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 41.498 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును వెటెల్‌ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫోర్స్‌ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్, పెరెజ్‌ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.    

Advertisement
 
Advertisement
Advertisement