ఫిజియో కోసం సైనాకు రూ. 9 లక్షలు | Saina for the physio to Rs. 9 lakh | Sakshi
Sakshi News home page

ఫిజియో కోసం సైనాకు రూ. 9 లక్షలు

Jun 25 2015 2:37 AM | Updated on Sep 3 2017 4:18 AM

ఫిజియో కోసం  సైనాకు రూ. 9 లక్షలు

ఫిజియో కోసం సైనాకు రూ. 9 లక్షలు

ప్రత్యేక వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌ను నియమించుకునేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

న్యూఢిల్లీ : ప్రత్యేక వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌ను నియమించుకునేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సైనాకు క్రీడా శాఖ రూ. 9 లక్షలను మంజూరు చేసింది. ఈ నెల నుంచి వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ ముగిసే వరకు సైనా ఫిజియోథెరపిస్ట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఫిజియోగా ఎవరిని నియమించుకోవాలనే అంశాన్ని సైనాకే వదిలేసినట్టు క్రీడా శాఖ తెలిపింది.

ప్రస్తుతం సైనా బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్ వరకు సైనా బెంగళూరులోనే శిక్షణ కొనసాగిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement