రోస్బర్గ్కే పోల్ పొజిషన్ | Nico Rosberg on pole for home German Grand Prix | Sakshi
Sakshi News home page

రోస్బర్గ్కే పోల్ పొజిషన్

Jul 30 2016 7:41 PM | Updated on Sep 4 2017 7:04 AM

రోస్బర్గ్కే పోల్ పొజిషన్

రోస్బర్గ్కే పోల్ పొజిషన్

ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ మరోసారి పోల్ పొజిషన్ సాధించాడు.

హాకెన్హీమ్:ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ మరోసారి పోల్ పొజిషన్ సాధించాడు. సొంతగడ్డపై శనివారం జరిగిన జర్మన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్బర్గ్ పోల్ పొజిషన్ సాధించాడు. తద్వారా ఈ సీజన్ లో ఐదోసారి పోల్ పొజిషన్ ను  నమోదు చేశాడు. రోస్ బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 14. 363 సెకన్లలో ల్యాప్ ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్ బర్గ్ పోల్ పొజిషన్ నుంచి ఆరంభిస్తాడు.

 

అయితే అతని సహచర జట్టు డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 0.107 సెకన్ల వెనుకబడి రెండో స్థానానికి పరిమితం కాగా, రెడ్ బుల్ డ్రైవర్ డేనియల్ రికియార్డో మూడో స్థానంలో నిలిచాడు. గత హంగేరీ గ్రాండ్ ప్రిలో పోల్ పొజిషన్ సాధించిన రోస్ బర్గ్ కు ఇది వరుసగా రెండో పోల్ పొజిషన్.
 

Advertisement
 
Advertisement
Advertisement