విజయం దిశగా కివీస్ | New Zealand team in winning position | Sakshi
Sakshi News home page

విజయం దిశగా కివీస్

Dec 22 2013 3:01 AM | Updated on Sep 2 2017 1:50 AM

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కరీబియన్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ (6/91) మ్యాజిక్‌ను చూపిస్తే... విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (4/23), టిమ్ సౌతీ (3/12) చుక్కలు చూపారు.

హామిల్టన్: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కరీబియన్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ (6/91) మ్యాజిక్‌ను చూపిస్తే... విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (4/23), టిమ్ సౌతీ (3/12) చుక్కలు చూపారు. దీంతో ఇరుజట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు (శనివారం) ఆటలో మొత్తం 17 వికెట్లు నేలకూలాయి. ఫలితంగా ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం దిశగా పయనిస్తోంది. విండీస్ నిర్దేశించిన 122 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఫుల్టన్ (4), రూథర్‌ఫోర్డ్ (0) క్రీజులో ఉన్నారు.
 
  అంతకుముందు 156/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 117.3 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌటైంది. దీంతో కరీబియన్ జట్టుకు 18 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. టేలర్ (264 బంతుల్లో 131; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా మూడోది, కెరీర్‌లో 11వ సెంచరీ సాధించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 31.5 ఓవర్లలో కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. స్యామీ (24) టాప్ స్కోరర్. వాగ్నేర్‌కు 2, అండర్సన్‌కు ఒక్క వికెటు దక్కింది.
 

Advertisement
 
Advertisement
Advertisement