ముంబై జట్టులో సిమ్మన్స్ | Mumbai Indians sign Lendl Simmons | Sakshi
Sakshi News home page

ముంబై జట్టులో సిమ్మన్స్

Apr 30 2014 1:35 AM | Updated on Sep 2 2017 6:42 AM

ముంబై జట్టులో సిమ్మన్స్

ముంబై జట్టులో సిమ్మన్స్

వరుస ఓటములతో కుదేలైన ముంబై ఇండియన్స్ జట్టు ఓ కీలక మార్పు చేసింది. వెస్టిండీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లెండిల్ సిమ్మన్స్‌ను జట్టులోకి తీసుకుంది. జలజ్ సక్సేనా స్థానంలో సిమ్మన్స్‌ను తీసుకోవడానికి ఐపీఎల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది.

జలజ్ సక్సేనా స్థానంలో తీసుకున్న ఫ్రాంచైజీ
 దుబాయ్: వరుస ఓటములతో కుదేలైన ముంబై ఇండియన్స్ జట్టు ఓ కీలక మార్పు చేసింది. వెస్టిండీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లెండిల్ సిమ్మన్స్‌ను జట్టులోకి తీసుకుంది. జలజ్ సక్సేనా స్థానంలో సిమ్మన్స్‌ను తీసుకోవడానికి ఐపీఎల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది.
 
 అయితే జలజ్‌ను ఎందుకు తీశారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మధ్యప్రదేశ్ క్రికెటర్ జలజ్ సక్సేనాను రూ.90 లక్షలకు ముంబై కొనుక్కుంది. కానీ సీజన్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. మరోవైపు వెస్టిండీస్ క్రికెటర్ సిమ్మన్స్ ఇప్పటివరకూ ఎప్పుడూ ఐపీఎల్‌లో ఆడలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement