బ్యాట్స్మన్ సాహసం | Lendl Simmons bats with only one pad in CPL, scores 60-ball 50 | Sakshi
Sakshi News home page

బ్యాట్స్మన్ సాహసం

Jul 12 2016 2:05 PM | Updated on Sep 4 2017 4:42 AM

బ్యాట్స్మన్ సాహసం

బ్యాట్స్మన్ సాహసం

వెస్టిండీస్ బ్యాట్స్మన్ లెండిల్ సిమన్స్ సాహసం చేశాడు.

ట్రినిడాడ్: వెస్టిండీస్ బ్యాట్స్మన్ లెండిల్ సిమన్స్ సాహసం చేశాడు. ఒక కాలికి మాత్రమే ప్యాడ్ కట్టుకుని బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు అర్ధసెంచరీ బాది ఔరా అనిపించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో అతడీ ఫీట్ చేశాడు. గయానా అమెజాన్ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియట్స్ తరపున బరిలోకి దిగిన సిమన్స్ సింగిల్ ప్యాడ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇన్నింగ్స్ 12 ఓవర్ లో బ్యాటింగ్ వచ్చిన సిమన్స్ 60 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. టీ20 మ్యాచుల్లో నెమ్మదిగా(ఎక్కువ బంతుల్లో) సాధించిన అర్ధసెంచరీ ఇదే కావడం మరో విశేషం. బ్యాట్స్మన్ ఒక కాలికి ప్యాడ్ కట్టుకుని బ్యాటింగ్ చేయడం తాను ఎక్కడా చూడలేదని కామెంటేటర్ ఇయాన్ బిషప్ వ్యాఖ్యానించాడు. టీమిండియాతో కొద్ది నెలల కిత్రం జరిగిన టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో సిమన్స్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement