జీతూ రాయ్కు స్వర్ణం | Jitu Rai shoots 50m Pistol gold at ISSF World Cup | Sakshi
Sakshi News home page

జీతూ రాయ్కు స్వర్ణం

Mar 4 2016 5:08 PM | Updated on Sep 3 2017 7:00 PM

జీతూ రాయ్కు స్వర్ణం

జీతూ రాయ్కు స్వర్ణం

ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో భారత షూటర్ జీతూ రాయ్ మెరిశాడు.

బ్యాంకాక్:ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో భారత షూటర్ జీతూ రాయ్ మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల 50మీ పిస్టోల్ ఈవెంట్లో జీతూ రాయ్ స్వర్ణం సాధించి సత్తా చాటుకున్నాడు. ఫైనల్ రౌండ్లో 191.3 పాయింట్లు సాధించడంతో అగ్రస్థానాన్ని దక్కించుకున్న జీతూ పసిడిని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, మాజీ వరల్డ్ చాంపియన్, చైనా షూటర్ పాంగ్ వో 186.5 పాయింట్లతో రెండో స్థానాన్ని సాధించి రజతాన్ని సాధించగా, మరో చైనా ఆటగాడు, ఒలింపిక్ పతక విజేత వాంగ్ హివెయ్ 165.8 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమై కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

క్వాలిఫయింగ్ రౌండ్లో మూడో స్థానం సాధించిన జితూ రాయ్ ఫైనల్ రౌండ్లో మాత్రం అంచనాలు మించి రాణించాడు. క్వాలింగ్ ఫయింగ్  సిరీస్ లో పాంగ్ వో, వాంగ్ హివెయ్ తొలి రెండు స్థానాల్లో నిలిచినా.. ఫైనల్ పోరులో మాత్రం జీతూ రాయ్ ప్రథమ స్థానంలో నిలిచి పసిడిని సాధించడం విశేషం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement