అది కోహ్లి నిర్ణయిస్తాడు: రోహిత్ | Sakshi
Sakshi News home page

అది కోహ్లి ఇష్టం: రోహిత్

Published Sat, Oct 21 2017 11:35 AM

I have no idea about that where Rahanewill be batting, says rohot sharma

ముంబై:గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టు ఓపెనర్ గా అజింక్యా రహానే బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. గతంలో మిడిల్ ఆర్డర్ లో వచ్చే రహానే..కొన్ని సిరీస్ ల నుంచి ఓపెనర్ గా వస్తున్నాడు. అయితే ఆదివారం  న్యూజిలాండ్ తో జరిగే తొలి వన్డేకు రహానే ఓపెనర్ గా దిగుతాడా?అని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించగా, అది తనకు తెలీదన్నాడు.

'నాకు రహానే బ్యాటింగ్ ఆర్డర్ కు సంబంధించి ఎటువంటి విషయం తెలీదు. ప్రస్తుతం శిఖర్ ధావన్ జట్టులో ఉన్నాడు. అలానే రహానేను ఏస్థానంలో దింపినా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. మరి రేపటి మ్యాచ్ లో రహానే ఏ స్థానంలో బ్యాటింగ్ వస్తాడనేది కెప్టెన్ విరాట్ కోహ్లి ఇష్టప్రకారమే ఉంటుంది.  అదే సమయంలో కోచ్ తో కలిసి రహానేను ఎక్కడ పంపాలనేది నిర్ణయించే అవకాశం ఉంది. ఇక్కడ నాకు సంబంధం లేదు. రహానే విషయం కోచ్, కెప్టెన్ లు చూసుకుంటారు'అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.  ఇదిలా ఉంచితే, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తో భారత ఆటగాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నాడు. ప్రమాదకరమైన బౌలర్ అయిన బౌల్ట్ నుంచి తమకు కఠినమైన సవాల్ ఎదురుకావచ్చని రోహిత్ అభిప్రాయపడ్డాడు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement