కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు హర్మీత్‌ దేశాయ్‌ | Harmeet Desai to career best rank | Sakshi
Sakshi News home page

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు హర్మీత్‌ దేశాయ్‌

May 3 2017 11:13 PM | Updated on Sep 5 2017 10:19 AM

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు హర్మీత్‌ దేశాయ్‌

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు హర్మీత్‌ దేశాయ్‌

ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణించిన భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు హర్మీత్‌ దేశాయ్‌

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణించిన భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు హర్మీత్‌ దేశాయ్‌ తొలిసారి తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను చేరుకున్నాడు. బుధవారం అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 5 స్థానాలు మెరుగుపరుచుకొని 95వ స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు శరత్‌ కమల్‌ 54వ స్థానంలో కొనసాగుతుండగా... సౌమ్యజిత్‌ ఘోష్‌ ఒక స్థానానికి ఎగబాకి 83వ ర్యాంకుకు చేరుకున్నాడు.

దీంతో తొలిసారి భారత్‌ నుంచి ముగ్గురు క్రీడాకారులు టాప్‌–100లో చోటు దక్కించుకున్నట్లయింది. మహిళల విభాగంలో మనికా బాత్రా 10 స్థానాలు దిగజారి 103 ర్యాంకుకి పడిపోయింది. యూత్‌ బాలుర విభాగంలో అర్జున్‌ ఘోష్‌ 98వ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో ఐహిక ముఖర్జీ 2 స్థానాలు ఎగబాకి 35వ స్థానాన్ని, అర్చన కామత్‌ 3 ర్యాంకులు కోల్పోయి 59వ స్థానాన్ని  దక్కించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement