ఆసీస్‌ ఘన విజయం

Australia beats Sri Lanka in first Test at the Gabba - Sakshi

బ్రిస్బేన్‌: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 40 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ (6/23) కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శనతో లంకను వణికించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు.  మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో లంక రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కనీసం 150 పరుగులైనా చేయలేకపోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే ఆలౌటైన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 139 పరుగులకే కుప్పకూలింది. తిరిమన్నే (32; 1 ఫోర్‌), డిక్‌వెలా (24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు చేసింది. రెండో టెస్టు 1 నుంచి కాన్‌బెర్రాలో జరుగుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top