మేం.. మోనార్కులం.. అంతా మాఇష్టం! | Sakshi
Sakshi News home page

మేం..మోనార్కులం..అంతా మాఇష్టం!

Published Fri, Sep 21 2018 1:04 PM

TDP Leaders Threats To Own Party Leaders Srikakulam - Sakshi

టెక్కలి: అదృష్టం తలుపు తడితే ఆనందించా లి...ఆ అదృష్టమే మమ్మల్ని వెతక్కుంటూ వచ్చిందని విర్రవీగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..కలలో కూడా ఊహించని పదవి రావడంతో, అధికారం తలకెక్కి సొంత పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులను సైతం వదలకుండా వారిపై బెదిరింపులు, కక్ష సాధింపులను చేస్తున్న సంతబొమ్మాళి  మండల ప్రజాప్రతినిధి భర్త, కుమారుడు వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రీ కొడుకులు చేస్తున్న ఆగడాలతో సొంత పార్టీ నాయకులతో పాటు ప్రజలు విస్తుపోతున్నారు. ఒకరు సైలెంట్‌...మరొకరు వయలెన్స్‌గా వ్యవహరించి అవతలి వారిని బెదిరించడం ఈ తండ్రీ కొడుకులు నైజం. పుత్రుడు చేసిన పరమశుంఠ పనులకు తండ్రి మద్దతు ఇవ్వడంతో రోజు రోజుకూ ఆగడాలు శృతి మించి సొంత పార్టీ నాయకులను విస్తు గొలిపేలా చేస్తున్నాయి.

తండ్రీ కొడుకులు చేసిన ఆగడాలకు కొన్ని సంఘటనలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు... మర్రిపాడు పంచాయతీకి చెందిన ఓ టీడీపీ నాయకునిపై నౌపడకు చెందిన మండల ప్రజాప్రతినిధి కుమారుడు బెదిరించి వార్నింగ్‌లు ఇచ్చిన సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. అయితే ఈ విషయం బయటకు పొక్కితే పార్టీకి ఇబ్బంది కరమని సుదూర ఆలోచన చేసిన మర్రిపాడుకు చెందిన ఆ నాయకుడు మౌనం దాల్చాడు. అలాగే పార్టీకి చెందిన నౌపడ–2 ఎంపీటీసీ సభ్యుడుబి.హరిశ్చంద్రరరావు గత ఏడాది జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సదరు మండల ప్రజాప్రతి నిధి భర్తపై అధికారుల సాక్షిగా మండిపడ్డారు. నా ఎంపీటీసీ పరిధికి నిధులు ఇవ్వకుండా చేస్తున్నావని, నా అన్నకు కూడా బీసీ కార్పొరేషన్‌ రు ణం ఇవ్వకుండా చేశావంటూ ఎంపీటీసీ సభ్యు డు హరిశ్చంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇలా సొంత పార్టీ ఎంపీటీసీపైనే కక్ష సాధించిన ఘనుడు ఆ మండల ప్రజాప్రతినిధి భర్త. ఇదే వ్యక్తి ఓ  సమావేశంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు ఎండయ్యరెడ్డిని హేళనగా చూడడం, చులకనగా మాట్లాడిన సందర్భం ఉంది. దీంతో ఎండయ్యరెడ్డి ఎదురుతిరిగి వచ్చే సర్పంచ్‌ ఎన్నికల్లో నీపై పోటీ చేసి ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటానని సవాల్‌ విసిరిన సంఘటనలు ఉన్నాయి.

తండ్రీ కొడుకులు తీరుతో సొంత ఊరిలో వేరే కుంపటి
సంతబొమ్మాళి మండల ప్రజాప్రతినిధి సొంత గ్రామమైన నౌపడలో టీడీపీ రెండు  కుంపటిలుగా తయారైంది. మండల ప్రజాప్రతినిధి భర్త, కుమారుని తీరుతో విసుగు చెందిన కొందరు తెలుగు తమ్ముళ్లు వేరేగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ తండ్రీ కొడుకులు అడుగడుగునా చేస్తున్న ఆగడాలపై మంత్రి అచ్చెన్నాయడు కనీసం దృష్టి సారించకపోవడం, సదరు ఆ తండ్రీ కొడుకులు ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఇటీవల జరిగిన కొన్ని ఉదాహరణలు కారణంగా చెప్పవచ్చు. అంతే కాకుండా తండ్రీ కొడుకుల తీరుతో ఇప్పటికే పార్టీపై తీవ్రంగా వ్యతిరేకత చోటు చేసుకుంటోంది.

ఉపాధ్యాయుడ్ని వదల్లేదు..
సంతబొమ్మాళి మండలం ప్రజాప్రతినిధి భర్త, కుమారుడి ఆగడాలు చివరకు ఉపాధ్యాయుడ్ని విడ్చి పెట్టలేదు. నౌపడ ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన స్థలంలో ఓ దుకాణం ఏర్పా టు చేయడానికి సదరు తండ్రీ కొడుకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇది పాఠశాల స్థలమని ఇక్కడ పెడితే విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతుందని ప్రధానోపాధ్యాయుడు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ  వినకుండా దౌర్జన్యం చేయడంతో సదరు ఉపాధ్యాయుడు తన బండి ని అడ్డంగా పెట్టి బైఠాయించిన సంఘటనలు ఉ న్నాయి.

అయితే ప్రజాప్రతినిధి కుమారుడు ఉపాధ్యాయుడిపై పరుష పదజాలంతో దూషించి బండినితో సేయండిరా...మాస్టార్‌ను ఈడ్చేయండిరా అంటూ అనుచరులను ఉసిగొల్పిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎంపీపీ భర్త విష్ణుమూర్తి ప్రాదేయపడినా తోసేశాడు. అయితే చివరకు ఆ ఉపాధ్యాయుడి నుంచి 2 వేల రూపాయలను తీసుకుని బడ్డీని మరో చోటకు తరలిం చినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. అదృష్టం కలిసొచ్చి వరించిన పదవులతో తండ్రీ కొడుకులు చేస్తున్న ఆగడాలపై కళ్లేం వేయాల్సిన మంత్రి సైతం మౌనం వహించడంలో అసలు ఆంతర్యమేమిటనే సందేహాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement