చంద్రబాబువి శవ రాజకీయాలు | Kodali Nani Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి శవ రాజకీయాలు

Dec 10 2019 5:17 AM | Updated on Dec 10 2019 5:17 AM

Kodali Nani Fires On Chandrababu Naidu - Sakshi

గుడివాడ టౌన్‌: చంద్రబాబువి శవ రాజకీయాలని ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ఆయనకు పరిపాటిగా మారిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. సోమవారం గుడివాడ రైతుబజారులో మృతి చెందిన సాంబిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సాంబిరెడ్డి ఆర్టీసీలో పనిచేస్తూ గుండె సమస్యతో 15 ఏళ్ల కిందట ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఆయనకు స్టెంట్‌ కూడా వేశారని తెలిపారు. ఎల్లో మీడియా ప్రతినిధులు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి ఉల్లిపాయల కోసం లైన్లో నిలబడి మృతి చెందారని చెబితే ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా వస్తుం దని చెప్పారన్నారు.

శాసనసభ జరుగుతుండగా సాంబిరెడ్డి ఫొటోను చంద్రబాబు అసెంబ్లీలో ప్రదర్శించారని.. ఉల్లి కోసం జరిగిన తొక్కిసలాటలో గుడివాడలో వ్యక్తి మృతి చెందాడంటూ గగ్గోలు పెట్టాడన్నారు. వెంటనే తాను ఆరాతీయగా.. అలాంటిదేమీ లేదని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. చంద్రబాబు శవాల కోసం ఎదురు చూస్తున్నారని, ఆయనకు తోడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కూడా వంత పాడటం దిగజారుడు రాజకీ యమన్నారు. సంబంధిత మీడియా యాజమాన్యంపై పరువు నష్టం దావా వేస్తామని సాంబిరెడ్డి కుటుంబీకులు హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement