మీది కట్టప్ప కత్తి పార్టీ: కొడాలి నాని ఫైర్‌

Kodali Nani Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి ఎక్కడా లేడని, బాబును మించిన అవినీతి చక్రవర్తి ఈ దేశంలోనే ఎవరూ లేరంటూ.. ఆయనకు పిల్లనిచ్చిన మామ, స్వర్గీయ ఎన్‌టీ రామారావు.. బాబు గురించి, ఆయన బతుకు గురించి ప్రజలందరికి చెప్పారన్నారు. చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ చంక నాలుగు సంవత్సరాలు నాకాడంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎన్నికలలో గుడ్డలూడదీసి పంపారంటూ ఎద్దేవా చేశారు. మొన్న సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు సూట్‌కేసులతో డబ్బులు మోశారని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు ఎప్పుడు దిగిపోతాడా అని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రకు భారీ స్పందన వచ్చిందని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని యాత్రను విజయవంతం చేశారన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకుండా చంద్రబాబు చాలా విధాలుగా అడ్డుపడ్డారని చెప్పారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ ప్రజా పాలన చేశారని తెలిపారు. ఆయన మరణించిన తర్వాత ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. మతి తప్పి టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. పాదయాత్రకు వచ్చిన స్పందన చూసి.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయాలనే టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘పవన్ కల్యాణ్ వచ్చి నాతో కలవాలని  చంద్రబాబు అంటారు. అసలు మీకు సిగ్గు, శరం ఉందా? మిమ్మల్ని రోజూ తిడుతున్న వ్యక్తి వచ్చి మధ్దతు ఇవ్వాలని కోరుతున్నావు. కాంగ్రెస్ వచ్చి నాతో కలవాలని అంటావు. అధికారం చేజిక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టి సోలోగా పోటి చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకుంటున్నారని మమ్మల్ని విమర్శిస్తున్నారు. మరి మీరు  365 రోజులు అసెంబ్లీలోనే ఉండి జీతాలు తీసుకుంటున్నారా? మీరు ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీకి వెళ్లని మిగిలిన రోజులకు మీరు జీతాలు ఇచ్చేస్తే మేం కూడా జీతాలు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కేసీఆర్ 20 ప్రశ్నలు అడిగితే ఒకదానికి కూడా సమాధానం చెప్పలేదు. చంద్రబాబు దగ్గరున్న ఊర కుక్కలతో మొరిగించాడు. చంద్రబాబూ నీ టైమ్ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుని పరిపాలన సాగించు. ఎన్నికలు వస్తున్నాయ్ అని చెప్పి ఎక్కడపడితే అక్కడ శంకుస్థాపనలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పెద్ద సైకో. మాది కోడి కత్తి పార్టీ అంటూ విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మీది కట్టప్ప కత్తి పార్టీయా’ అంటూ కొడాలి నాని విమర్శించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top