‘ప్రజాధనాన్ని దోచుకున్నవారికి చంద్రబాబు పునరావాసం’

Alla Nani Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : ప్రజాధనాన్ని దోచుకున్న టీడీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పునరావాసం కల్పిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చారని అన్నారు. ప్రజా సంక్షేమం​ కోసం కృషి​ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మొదటి మూడు నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement
Back to Top