చంద్రబాబు పాస్‌పోర్టును తీసేసుకుంటారా? | Sakshi
Sakshi News home page

ఐటీ సోదాలపై చంద్రబాబు అసత్య ప్రచారం

Published Sat, Oct 6 2018 2:07 PM

Adimulapu Suresh Slams Chandra Babu Naidu Regarding Income tax Raids - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ సోదాలు, తనిఖీలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత ఆదిమూలపు సురేష్‌ వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. దాడులు టార్గెట్‌ చేసి చేసినవి కాదని సాధారణంగా వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తలపై జరుగుతున్న సోదాలేనని అన్నారు. ఐటీ పరిధిలోనికి వచ్చే వ్యాపారులపై జగిగేవి మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు ఐటీ దాడులపై కాబినేట్‌ సమావేశంలో చర్చించి రాష్ట్ర సమస్యగా చిత్రీకరణ చేస్తున్నారని విమర్శించారు.

ఐటీ దాడుల నుంచి ఏవిధంగా బయటపడేయాలో చర్చించడం సిగ్గుచేటన్నారు. పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం సర్వసాధారణమన్నారు. చంద్రబాబు ఐటీ దాడులకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు పాస్‌పోర్టును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నారా? విదేశాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోబోతున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం మధ్య యుద్ధం అని చెప్పి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.

మీరు ఎమ్మెల్యేలను కొన్నారా లేదా  అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మార్చలేదా అని సూటిగా అడిగారు. ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే మరిన్ని ఐటీ దాడులు చేయాలని కోరుతున్నామని అన్నారు. చంద్రబాబు గాండ్రిపులకు బెదిరింపులకు భయపడేది లేదన్నారు. చంద్రబాబు తప్పులు చేశారని, ఆర్ధిక నేరగాడని.. చట్టం కచ్చితంగా శిక్షించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement