యువతిపై దారుణం | Woman raped by four family members, | Sakshi
Sakshi News home page

యువతిపై తండ్రి, సోదరుడు, చిన్నాన్నల అత్యాచారం

Nov 28 2017 2:05 PM | Updated on Jul 28 2018 8:44 PM

Woman raped by four family members, - Sakshi

సాక్షి, ముజఫర్‌ నగర్‌ : ఉత్తర్‌ ప్రదేశ్‌లో మహిళలపై అరాచాకాలకు, అకృత్యాలకు అం‍తేలేకుండా పోయింది. ఒక మహిళపై కుటుంబ సభ్యులే నెలల తరబడి అత్యాచారం చేసిన హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రి, సోదరుడు, ఇద్దరు చిన్నాన్న వరసయ్యే వ్యక్తులు మూడు నెలల పాటు యువతి నీచంగా అత్యాచారానికి పాల్పడ్డారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ముజఫర్‌నగర్‌లోని ధనేవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.


బాధిత యువతి తండ్రి, సోదరుడు, ఇద్దరు చిన్నాన్నలు మూడు నెలలుగా అత్యాచారం చేశారని ధనేవాడ పోలీస్ అధికారి కుష్పాల్‌ సింగ్‌ తెలిపారు. కుటుంబ సభ్యులే అత్యంత రాక్షసకంగా, పాశవికంగా యువతి అత్యాచారం చేస్తున్న సందర్భంలో..  ఆమె ప్రేమించిన వ్యక్తి కాపాడారని ఆయన తెలిపారు. ప్రియుడి సహకారంతొనే ఇంటి నుంచి  యువతి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరిపామని..అందులో ఈ దారుణం గురించిన వివరాలు బమటకు వచ్చాని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును అలహాబాద్‌ హైకోర్టు విచారణ చేస్తోందని చెప్పారు. తండ్రి, సోదరుడు, చిన్నాన్నలను ఇప్సటికే కస్టడీలోకి తీసుకున్నట్లు కుష్పాల్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement