నేడు బిలాస్పూర్లో రాహుల్ పర్యటన | Rahul gandhi to visit bilaspur | Sakshi
Sakshi News home page

నేడు బిలాస్పూర్లో రాహుల్ పర్యటన

Nov 15 2014 12:27 PM | Updated on Sep 2 2017 4:31 PM

నేడు బిలాస్పూర్లో రాహుల్ పర్యటన

నేడు బిలాస్పూర్లో రాహుల్ పర్యటన

చత్తీస్గఢ్లోని బిలాస్పూర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధితులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.

బిలాస్పూర్: చత్తీస్గఢ్లోని బిలాస్పూర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధితులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. శనివారం రాహుల్ బిలాస్పూర్లో పర్యటించనున్నారు.

బిలాస్‌పూర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం 13 మంది మహిళల ప్రాణాలను బలిగొంది. బిలాస్‌పూర్ పట్టణ శివార్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభుత్వం శనివారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో 83 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకోగా వారిలో 13 మంది మహిళలు ఆపరేషన్లు వికటించడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Advertisement
 
Advertisement
Advertisement