38 దేశాల్లో ‘పీఎం నరేంద్ర మోదీ’ | PM Modi Biopic To Be Released In 38 Countries | Sakshi
Sakshi News home page

38 దేశాల్లో ‘పీఎం నరేంద్ర మోదీ’

Apr 7 2019 5:21 AM | Updated on Apr 7 2019 5:21 AM

PM Modi Biopic To Be Released In 38 Countries - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ని అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తోసహా 38 దేశాల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఆనంద్‌ పండిట్‌ చెప్పారు. ఒమంగ్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. భారత్‌లో 1,700, ఓవర్‌సీస్‌లో 600 స్క్రీన్‌లలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని ఆనంద్‌ చెప్పారు. ‘ఈ సినిమా వినోదం సైతం ఉంది. ప్రధానిని పొగుడుతూ, విపక్ష పార్టీలకు కౌంటర్‌గా సినిమా తీయలేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి మోదీ ప్రయాణాన్నే ప్రధానంగా చూపించాం’ అని చెప్పారు. సినిమా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement