మమత ప్రాణాలకు ముప్పుంది! | Mamata banerjee life is in danger, say opposition leaders in parliament | Sakshi
Sakshi News home page

మమత ప్రాణాలకు ముప్పుంది!

Dec 1 2016 11:24 AM | Updated on Sep 4 2017 9:38 PM

మమత ప్రాణాలకు ముప్పుంది!

మమత ప్రాణాలకు ముప్పుంది!

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాణాలకు ముప్పుందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాణాలకు ముప్పుందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం కోల్‌కతా విమానాశ్రయంలో దాదాపు అరగంట పాటు గాల్లోనే తిరిగిందని, ఆ సమయంలో విమానంలో ఇంధనం అయిపోతోందని చెప్పినా ఏటీసీ నుంచి అనుమతి రాలేదని పార్లమెంటు ఉభయ సభల్లో టీఎంసీ సభ్యులు ప్రస్తావించారు. కోల్‌కతా విమానాశ్రయంలో జరిగినది ఏమాత్రం సరికాదని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు డిమాండ్ చేశారు.  (దీదీని హతమార్చేందుకు కుట్ర!)
Advertisement
 
Advertisement
Advertisement