9న రైల్వే లోకోపైలట్, టెక్నీషియన్‌ పరీక్ష | loco pilot exam on august 9 | Sakshi
Sakshi News home page

9న రైల్వే లోకోపైలట్, టెక్నీషియన్‌ పరీక్ష

Jul 23 2018 4:41 AM | Updated on Jul 23 2018 4:41 AM

loco pilot exam on august 9 - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 26,502 అసిస్టెంట్‌ లోకో పైలట్లు, టెక్నీషియన్‌ పోస్టులకు ఆగస్టు 9న మొదటి విడత కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. ఈ పరీక్షకు నాలుగురోజుల ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కాల్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చంది. సాధారణ అభ్యర్థులకు 60 నిమిషాలు, దివ్యాంగులకు అదనంగా 20 నిమిషాల సమయాన్ని కేటాయించనున్నట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement