'లిక్కర్ షాపులను హైవేల నుంచి తొలగించండి' | Kerala asked to shift liquor shops away from highways | Sakshi
Sakshi News home page

'లిక్కర్ షాపులను హైవేల నుంచి తొలగించండి'

Nov 10 2014 2:35 PM | Updated on Sep 2 2017 4:12 PM

జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను వేరేచోటుకి తరలించాలని కేరళ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

కొచ్చి:జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను వేరే చోటుకి తరలించాలని కేరళ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులు హైవేలపై ఉండటం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయనే ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్)ను స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైవే మార్గంలో మద్యం షాపులు ఉండటం వల్ల వాహన డ్రైవర్లు సులువుగా మద్యాన్ని సేవించి ప్రమాదాలు  కారణమతున్నారని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు.

 

జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 169 లిక్కర్ షాపులను వేరే చోటకి తరలించాలని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం రెండు వారాల్లో నివేదిక అందజేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement