ఢిల్లీ కన్నాట్ప్లేస్లో అగ్నిప్రమాదం | Fire in Delhi connaught place building | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కన్నాట్ప్లేస్లో అగ్నిప్రమాదం

Aug 25 2014 12:47 PM | Updated on Oct 2 2018 4:26 PM

ఢిల్లీలోని ఓ భవనంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. కన్నాట్ప్లేస్లో ఓ భవనంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ భవనంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. కన్నాట్ప్లేస్లో ఓ భవనంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఈరోజు ఉదయం 7.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సుమారు మూడు గంటల అంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ఎన్ఐఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఉన్న ఏ-బ్లాక్లో అగ్నిప్రమాదం జరిగింది. కాగా ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  ఇక ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ అనంతరం తేలుతుందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ ఏ.కె. శర్మ తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement