కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పొడిగింపు | deadline for exchanging pre-2005 curency extend till december 31 | Sakshi
Sakshi News home page

కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

Jun 25 2015 8:59 PM | Updated on Sep 3 2017 4:21 AM

కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: 2005కి ముందు ఉన్నకరెన్సీ మార్చుకునేందుకు రిజర్వు బ్యాంకు ఇచ్చిన గడువు మరింత పొడిగించారు. మరో వారం రోజుల్లో ఈ గడువు ముగియనుండగా.. ఈ ఏడాది చివరివరకు(డిసెంబర్ 31) వరకు పొడిగించారు.

న్యూఢిల్లీ: 2005కి ముందు ఉన్నకరెన్సీ మార్చుకునేందుకు రిజర్వు బ్యాంకు ఇచ్చిన గడువు మరింత పొడిగించారు. మరో వారం రోజుల్లో ఈ గడువు ముగియనుండగా.. ఈ ఏడాది చివరివరకు(డిసెంబర్ 31) వరకు పొడిగించారు. ఆలోగా ప్రజలు తమ వద్ద ఉన్న 2005కు పూర్వంనాటి కరెన్సీ నోట్లను రూ.500, రూ.1000 సహా బ్యాంకుల్లో ఇచ్చేసి కొత్తగా మార్పిడి చేసుసుకునే వీలుంది.  2005కంటే ముందునాటి రూ.500, రూ.1000 నోట్లను వెంటనే ఆయా బ్యాంకుల్లో ఇచ్చేసి వినియోగదారులు మార్చుకోవాలని ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

గతంలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించినా కొన్ని కారణాలవల్ల గడువును రెండుసార్లు పొడిగించారు. జూన్ 30లోగా రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించాలని చెప్పారు. దీంతో గడువు దగ్గరికొచ్చింది. కొన్ని అంశాల్లో ఇబ్బందులు తలెత్తడంతోపాటు నకిలీ నోట్లు కూడా చెలామణి అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా గత నోట్లను తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. వాస్తవానికి, నల్లధనం బయటకు రప్పించాలనే ఉద్దేశంతో కూడా దీనిని ప్రధానంగా తెరముందుకు తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement