‘తప్పులు చేసే మోదీకి స్కామ్‌లే కనిపిస్తాయి’ | Akhilesh Yadav, Rahul Gandhi redefine Modi's SCAM | Sakshi
Sakshi News home page

‘తప్పులు చేసే మోదీకి స్కామ్‌లే కనిపిస్తాయి’

Feb 6 2017 2:31 AM | Updated on Mar 18 2019 9:02 PM

‘తప్పులు చేసే మోదీకి స్కామ్‌లే కనిపిస్తాయి’ - Sakshi

‘తప్పులు చేసే మోదీకి స్కామ్‌లే కనిపిస్తాయి’

ఎస్పీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్‌’గా ప్రధాని మోదీ అభివర్ణించటాన్ని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సీఎం అఖిలేశ్‌లు ఆదివారం తిప్పికొట్టారు.

కాన్పూర్‌: ఎస్పీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్‌’గా ప్రధాని మోదీ అభివర్ణించటాన్ని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సీఎం అఖిలేశ్‌లు ఆదివారం తిప్పికొట్టారు. మోదీ తప్పులు చేస్తున్నారు కాబట్టే ఆయనకు స్కామ్‌లు కనిపిస్తున్నాయని రాహుల్‌ అన్నారు.

సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ల పొత్తు తో మోదీకి భయం పట్టుకుందనీ, బిహార్‌లో బీజేపీకి ఎదురైన పరాభవాన్ని ఉత్తరప్రదేశ్‌లోనూ పునరావృతం చేసి చూపించాలని రాహల్‌ ప్రజలను కోరారు. ‘స్కామ్‌’అం టే ‘సేవ్‌ కంట్రీ ఫ్రమ్‌ అమిత్‌షా అండ్‌ మోదీ’అని అఖిలేశ్‌ కొత్త భాష్యం చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement