అయోగ్య.. మక్కీ టు మక్కీ దించేశారు..! | Vishal Ayogya Teaser Same As Jr Ntr Temper | Sakshi
Sakshi News home page

అయోగ్య.. మక్కీ టు మక్కీ దించేశారు..!

Feb 7 2019 11:44 AM | Updated on Feb 7 2019 11:44 AM

Vishal Ayogya Teaser Same As Jr Ntr Temper - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌ హిట్ సినిమా టెంపర్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న తమిళ మూవీ అయోగ్య. విశాల్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. టీజర్‌ సేమ్‌ టూ సేమ్‌ టెంపర్‌ లాగే ఉంది. లొకేషన్స్‌, విలన్‌, యాక్షన్‌ సీన్స్‌ ఇలా అన్ని టెంపర్‌నే ఫాలో అయిపోయారు. విశాల్ కథలో చాలా మార్పులు చేసినట్టుగా చెపుతున్న టీజర్‌ చూస్తే మాత్రం మార్పులు చేసినట్టుగా ఏం అనిపించటంల లేదు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన సూపర్‌ హిట్ సినిమా టెంపర్‌. ఎన్టీఆర్‌లోని నటుడిని సరికొత్తగా ఆవిష్కరించిన ఈ సినిమా ఇతర భాషల్లోనూ రీమేక్‌ అయ్యింది. ఇప్పటికే సింబాగా బాలీవుడ్‌లో సత్తా చాటిన టెంపర్‌, త్వరలో  కోలీవుడ్‌లోనూ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైట్‌ హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతుండగా ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement