స్పెయిన్కి మిస్టర్! | varun tej movie mister shooting in spain | Sakshi
Sakshi News home page

స్పెయిన్కి మిస్టర్!

Jun 9 2016 11:15 PM | Updated on Sep 4 2017 2:05 AM

స్పెయిన్కి మిస్టర్!

స్పెయిన్కి మిస్టర్!

వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘మిస్టర్’ ఏప్రిల్‌లో ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే.

వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ కాంబినేషన్‌లో  రూపొందనున్న ‘మిస్టర్’ ఏప్రిల్‌లో ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 27న స్పెయిన్‌లో మొదలు కానుంది. ఈ విషయాన్ని వరుణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘ఈ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’  అని ఆయన ట్వీట్ చేశారు. వినోద ప్రధానంగా సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రం కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ చిత్రం అంగీకరించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement